నిమిషానికోసారి కరోనా అప్‌డేట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా రోజుకి వందల్లో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. అయితే ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు అనేది తెలిస్తేనే వైరస్ వ్యాప్తిని అంచనా వేసి నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ డేటా విషయంలో అమెరికాలోని సియాటెల్‌కి చెందిన ఓ పదిహేడేళ్ల కుర్రాడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాయం చేస్తున్నాడు. అంటే ప్రత్యక్షంగా కాదు… అతను డిసెంబర్‌లో తయారు చేసిన ఓ వెబ్‌సైట్ ద్వారా అతను తన వంతు సాయం చేస్తున్నాడు. అవీ షిఫ్‌మెన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా రోజుకి వందల్లో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. అయితే ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు అనేది తెలిస్తేనే వైరస్ వ్యాప్తిని అంచనా వేసి నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ డేటా విషయంలో అమెరికాలోని సియాటెల్‌కి చెందిన ఓ పదిహేడేళ్ల కుర్రాడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాయం చేస్తున్నాడు. అంటే ప్రత్యక్షంగా కాదు… అతను డిసెంబర్‌లో తయారు చేసిన ఓ వెబ్‌సైట్ ద్వారా అతను తన వంతు సాయం చేస్తున్నాడు.
అవీ షిఫ్‌మెన్ అనే విద్యార్థి ఈ మధ్య 24 గంటలు తన కరోనా అప్‌డేట్ వెబ్‌సైట్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చే పనిలో పడ్డాడు. ncov2019.live అనే ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? ఎంత మందికి సీరియస్‌గా ఉంది? ఎంత మంది కోలుకున్నారనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
విశ్వసనీయ వెబ్‌సైట్ల నుంచి వార్తలను ఈ వెబ్‌సైట్ గ్రహిస్తుంది. వెబ్ స్క్రాపింగ్ టెక్నాలజీ ద్వారా ప్రతి కరోనా కేసు అప్‌డేట్‌ని గుర్తుపట్టే అల్గారిథంను అవీ షిఫ్‌మెన్ కోడ్ చేశాడు. దీని ద్వారా కరోనా కేసు నమోదైందంటూ ఒక వార్త వస్తే ఈ వెబ్‌సైట్ విశ్వసనీయత ఆధారంగా ఆ కేసును లెక్కిస్తుంది.
ఈ వెబ్‌సైట్ ప్రారంభించినపుడు ప్రతి 10 నిమిషాలకొకసారి అప్‌డేట్ అయ్యేది. కానీ ఇప్పుడు కరోనా ప్రభావం పెరిగింది కాబట్టి ప్రతి నిమిషానికి అప్‌డేట్ అయ్యేలా అవీ షిఫ్‌మెన్ దీన్ని ప్రోగ్రామ్ చేశాడు. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం చాలా ఉపయోగకరంగా ఉండటంతో అన్ని దేశాల నుంచి విజిట్లు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 3.2 మిలియన్ మంది ఈ వెబ్‌సైట్‌ను వీక్షించారు. ఈ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని వేర్వేరు భాషల్లోకి అనువదించడానికి అవీ షిఫ్‌మెన్ ప్రస్తుతం తలమునకలై ఉన్నాడు. కేవలం అంకెలతో కూడిన డేటా మాత్రమే కాకుండా ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్, ట్విట్టర్ ఫీడ్, మూలాల సమాచారం, వైరస్‌కి సంబంధించిన సమాచారాన్ని కూడా అవీ షిఫ్‌మెన్ ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు.