బెంగాల్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్..?

దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టాట్ అయిందా అంటే అవుననే సంకేతాలు మెండుగా కనిపిస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, పాలన గాడీ తప్పిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా, డీజీపీ వీరేంద్ర విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ ధనకర్ కేంద్రానికి నివేదిక పంపారు. దీనిపై స్పందించిన […]

Update: 2020-12-11 21:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టాట్ అయిందా అంటే అవుననే సంకేతాలు మెండుగా కనిపిస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, పాలన గాడీ తప్పిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా, డీజీపీ వీరేంద్ర విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ ధనకర్ కేంద్రానికి నివేదిక పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీచేశారు. అయితే, అమిత్ షా ఆదేశాలను సీఎస్ బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. సీఎం మమతా ఆదేశాల మేరకు ఆయన ఇలా ప్రవర్తించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మమతా ప్రభుత్వంపై యాక్షన్ ప్లాన్‌కు కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

అంతకుముందు, బెంగాల్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని ఓ వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్‌తో పాటు కేంద్ర నాయకత్వం కూడా మమతా సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం.. గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపడం.. అమిత్ షా సీఎస్, డీజీపీని ఢిల్లీకి రావాలని ఆదేశించడం చూస్తుంటే మమతా సర్కార్‌కు చెక్ పెట్టేందుకేనని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలాఉండగా, వచ్చేఏడాది ఏప్రిల్ -మే నెలలో బెంగాల్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇప్పటికే వెలువడిన ఏబీపీ, పలు ప్రీపోల్ సర్వేల్లో ఈసారి మమతా సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుందని వెల్లడించాయి. గతంలో అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ మిగతా పార్టీలన్నింటిని దాటేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుందని ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా, సీఎం మమతా బెనర్జీ పర్సనల్‌గా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీఎంసీ పార్టీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవనుందని తేలింది.

తృణమూల్ ఓటమి ఖాయమని దీదీకి ముందే తెలుసునని.. అందుకే రాష్ట్రంలో విధ్వంస పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని పలువురు బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎట్టిపరిస్థితు ల్లోనూ బెంగాల్లో బీజేపీని అధికారంలోనికి రాకుండా ఉండేందుకు మమతా బెనర్జీ తన సర్వశక్తులు ఒడ్డుతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, ఇప్పటివరకు బెంగాల్లో బీజేపీ ప్రచారం నిర్వహించిన ప్రతీసారి అల్లర్లు, విధ్వంసం చెలరేగాయి. వీటిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. వీటన్నింటిని మమతా సర్కార్ ఆగడాలుగా చూపిస్తూ బీజేపీ ఎన్ క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ‘దీదీ’ ఈ సారి పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో జట్టు కట్టింది. ఇద్దరు తమ వ్యుహాలను పదును పెడుతూ ముందుకెళ్తున్నారు. కానీ, బీజేపీ మైండ్ గేమ్ ముందు మమత పాచికలు పారడం లేదని తెలుస్తోంది. ఇది ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో దీదీ ఇంటి బాట పట్టడం ఖాయమని పలువురు సర్వేలతో పాటు పొలిటికల్ వర్గాలు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News