కొవిడ్ వ్యాక్సిన్‌ విషయంలో అపోహలు వద్దు: ఉపాసన

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఇచ్చాక కొందరు అనారోగ్యానికి గురికావడంతో భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్స్‌లు ఉన్నాయనే అపోహలో ఉన్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ఆమె..అపోలో హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ […]

Update: 2021-01-28 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఇచ్చాక కొందరు అనారోగ్యానికి గురికావడంతో భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే చాన్స్‌లు ఉన్నాయనే అపోహలో ఉన్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ఆమె..అపోలో హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే.. కొవిడ్ మహమ్మారిని జయిస్తామన్నారు ఉపాసన.

Tags:    

Similar News