నెటిజన్స్ ఫిదా.. బ్రహ్మముడితో వెళ్లి ప్రాణాన్ని నెలబెట్టారు
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ నవ జంట చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెండ్లి అయిన కొద్దిసేపటికే వారు తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. బాధ్యత తెలిసిన కపుల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అప్పుడే పెళ్లయిన జంట అసలేం చేసింది. సోషల్ మీడియాలో వారు ఎందుకంత ఫేం అయ్యారో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ.. పెండ్లి పీటల నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన వధువు.. అలాగే మండపం నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ నవ జంట చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెండ్లి అయిన కొద్దిసేపటికే వారు తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. బాధ్యత తెలిసిన కపుల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అప్పుడే పెళ్లయిన జంట అసలేం చేసింది. సోషల్ మీడియాలో వారు ఎందుకంత ఫేం అయ్యారో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..
పెండ్లి పీటల నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన వధువు.. అలాగే మండపం నుంచి పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న దంపతులు అనే వార్తలు మనం చాలా వింటూనే ఉన్నాం. సరిగ్గా అలాంటి పనినే ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ జంట కూడా చేసింది.
యూపీలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మాయికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అందుకు అర్జంట్‌గా బ్లడ్ అవసరమైంది. బాధితురాలి తల్లి దండ్రులు తెలిసిన బంధువులందరికీ ఫోన్లు చేశారు. ఆమె కష్టం విన్న వారంతా అయ్యో పాపం అనడమే తప్పా రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
मेरा भारत महान |
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలీదు గానీ.. పెండ్లి దుస్తుల్లో నూతన వధువరులు ఆస్పత్రికి వచ్చారు. చావు బతుకుల్లో ఉన్న అమ్మాయికి పెండ్లి కొడుకు రక్తదానం చేశాడు. అయితే, బ్రహ్మముడి విప్పకపోవడంతో పెళ్లికూతురు అలాగే అతని పక్కనే నిల్చుంది.. గుర్తుతెలియని వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేస్తున్న తన భర్తకు పెళ్లికూతురు సైతం మద్దతు తెలిపింది.అనంతరం ఆస్పత్రి నుంచి ఆ జంట పెండ్లి మండపానికి వెళ్లిపోయారు.
కాగా, ఆపత్కాలంలో బంధువులు, కుటుంబసభ్యులు చేయలేని పనిని.. కొత్త జంట చేసిందని యూపీకి చెందిన ఓ పోలీస్ అధికారి అభినందిచాడు. అంతేకాకుండా, పెళ్లికొడుకు రక్తదానం చేస్తున్న ఫోటో, బెడ్ పక్కనే నిల్చున్న పెళ్లికూతురు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అదికాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఇద్దరినీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఆ కపుల్ పేర్లు వెల్లడించకపోవడం కొసమెరుపు.