ప్రియాంక ప్రతిపాదనకు సీఎం యోగి అంగీకారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ ప్రతిపాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు అంగీకరించారు. యూపీలోని వలస కూలీలను తరలించేందుకు 1000 బస్సులను ఏర్పాటు చేస్తామని ఆదివారం యూపీ సర్కార్‌కు ప్రతిపాదింస్తూ ట్వీట్ చేసింది. కానీ, అందుకు అనుమతి ఇవ్వలేదని, వలస కూలీల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని..అలాగే ఎవరైనా సహకరిస్తామని ముందుకు వచ్చినా అంగీకరించట్లేదని విమర్శిస్తూ మరోసారి ట్వీట్ చేసింది. అలాగే సోమవారం ఘజియాబాద్‌లోని రాంలీలా మైదానంలో స్వస్థలాలకు వెళ్లేందుకు గుమిగూడిన వలస […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ ప్రతిపాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు అంగీకరించారు. యూపీలోని వలస కూలీలను తరలించేందుకు 1000 బస్సులను ఏర్పాటు చేస్తామని ఆదివారం యూపీ సర్కార్‌కు ప్రతిపాదింస్తూ ట్వీట్ చేసింది. కానీ, అందుకు అనుమతి ఇవ్వలేదని, వలస కూలీల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని..అలాగే ఎవరైనా సహకరిస్తామని ముందుకు వచ్చినా అంగీకరించట్లేదని విమర్శిస్తూ మరోసారి ట్వీట్ చేసింది. అలాగే సోమవారం ఘజియాబాద్‌లోని రాంలీలా మైదానంలో స్వస్థలాలకు వెళ్లేందుకు గుమిగూడిన వలస కార్మికుల వీడియోనూ జత చేసింది. ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే యూపీ ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రియాంక గాంధీ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. బస్సులు, వాటి డ్రైవర్లు, వీలైతే ఆ బస్సుల్లో ప్రయాణించే యూపీ కార్మికుల వివరాలనూ ప్రభుత్వానికి వెంటనే అందజేయాలని, తాము తప్పకుండా ఆ బస్సులను రాష్ట్రంలోకి అనుమతిస్తామని యోగి సర్కారు పేర్కొంది. ఆ బస్సుల్లో ప్రయాణించేవారి వివరాలు అందిస్తే.. వారిని సొంతూళ్లకూ సులువుగా పంపించే అవకాశం ఉంటుందని వివరించింది. అయితే, గతమూడు రోజుల నుంచి ఎలాంటి బస్సుల జాబితా తమ వద్దకు రాలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించడం గమనార్హం.