ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే..!
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువగా బౌలర్లు, ఆల్‌రౌండర్లను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపించాయి. వేలంలో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ కొందరిని అసలు కొనుగోలు చేయలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ జేసన్ రాయ్ (రూ. 2 కోట్లు)ని బేస్ ప్రైస్‌కు తీసుకోవడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఆరోన్ పించ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అలెక్స్ హేల్స్, షాన్ మార్ష్, కోరీ అండర్సన్, డారెన్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువగా బౌలర్లు, ఆల్‌రౌండర్లను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపించాయి. వేలంలో ఉన్న స్టార్ బ్యాట్స్‌మెన్ కొందరిని అసలు కొనుగోలు చేయలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ జేసన్ రాయ్ (రూ. 2 కోట్లు)ని బేస్ ప్రైస్‌కు తీసుకోవడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఆరోన్ పించ్‌ను ఎవరూ పట్టించుకోలేదు.
అలెక్స్ హేల్స్, షాన్ మార్ష్, కోరీ అండర్సన్, డారెన్ బ్రావో, మార్టిన్ గుప్తిల్, బౌలర్లు మార్నే మార్కెల్, ఆదిల్ రషీద్, షెల్డన్ కొట్రైల్, బిల్లీ స్టాన్‌లేక్, టిమ్ సౌథీ, ఇష్ సోథి, వరుణ్ అరోన్, షాన్ అబాట్, అంకిత్ సింగ్ రాజ్‌పుత్, తుషార్ దేశ్‌పాండేలు కూడా అమ్ముడు పోలేదు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు అయిన అలెక్స్ కేరీ, మాథ్యూ వేడ్, గ్లెన్ ఫిలిప్స్, ఆల్ రౌండర్లు అయిన మార్నస్ లబుషేన్, షెఫానే రూథర్‌ఫార్డ్, కీమో పాల్, కార్లోస్ బ్రాత్‌వైట్ ఇరుసు ఉదాన, స్టువర్ట్ బిన్నీ, క్రిస్ గ్రీన్ అమ్ముడు పోలేదు. వీరు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్నా.. ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొనే కొనుగోలు చేయనట్లు తెలుస్తున్నది.
వీళ్లను ఎవరూ కొనలేదు..
1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)
2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)
3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
5. హనుమ విహారీ(భారత్)
6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)
7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)
8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)
9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)
10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)
11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)
12. వరుణ్ ఆరోన్ (భారత్)
13. మోహిత్ శర్మ(భారత్)
14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)
15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)
16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)