ఆరుగాలం కష్టానికి దాపురించె పాడుకాలం!
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి (కొవిడ్ 19) యావత్ ప్రజానికాన్ని అతలాకుతలం చేస్తోంది. అన్నదాత ఆరుగాలం కాయ కష్టం చేసిక కంటికి రెప్పలా కాపాడి పండించిన పంటను అమ్ముకొలేని దుస్థితి నెలకొంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మార్కెట్లు అన్ని మూతపడ్డాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులు రాకపోవడంతో మార్కెట్లన్ని వెలవెలబోతున్నాయి. రైతులు మార్కెట్‌కు తెచ్చిన సరుకు రోడ్డు పాలవుతోంది. రోడ్ల మీద నిరీక్షణ.. మార్కెట్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది హమాలీ కూలీలు, ఆటోడ్రైవర్లు, […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి (కొవిడ్ 19) యావత్ ప్రజానికాన్ని అతలాకుతలం చేస్తోంది. అన్నదాత ఆరుగాలం కాయ కష్టం చేసిక కంటికి రెప్పలా కాపాడి పండించిన పంటను అమ్ముకొలేని దుస్థితి నెలకొంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మార్కెట్లు అన్ని మూతపడ్డాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులు రాకపోవడంతో మార్కెట్లన్ని వెలవెలబోతున్నాయి. రైతులు మార్కెట్‌కు తెచ్చిన సరుకు రోడ్డు పాలవుతోంది.
రోడ్ల మీద నిరీక్షణ..
మార్కెట్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది హమాలీ కూలీలు, ఆటోడ్రైవర్లు, పండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల కుటుంబాలు అల్లడిపోతున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి కాయ కష్టం చేసి రాత్రీ అనక పగలు అనకా కంటికి రెప్పలా కాపాడుతూ పండించి పంట అమ్ముకుందామనుకే సమయానికి మాయదారి వైరస్ వచ్చి వారి నోటికాడి బుక్కలో మట్టికొట్టినట్లైంది. రైతులు పంటను మార్కెట్‌కు తెస్తే కొనుగోలు చేసేవారు లేకా వారాల కొద్ది రోడ్లమీద నిరీక్షీస్తున్నారు.
దళారుల రాజ్యం..
రాష్ట్ర రాజాధాని హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం, కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌కు రాష్ట్ర నలుమూల నుంచి రైతులు పండించిన పంటలు అమ్ముకొవడానికి వస్తుంటారు. లాక్‌డౌన్‌తో పది రోజుల నుంచి ఫ్రూట్ మార్కెట్ తెరువక పోవడంతో రైతులు పండించిన పంటను దళారులకు అడిగిన ధరకు విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా పంట కోసిన కూలీలు ఖర్చులు, మార్కెట్‌కు తెచ్చిన రవాణ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్లపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున్నపడ్డాయి.
హైదరాబాద్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌లో వేలాది మంది చిన్నా చితక వ్యాపారుల నుంచి మొదలుకొని హమాలీ కూలీలు, ట్యాక్సిడ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, తోపుడుబండ్లపై పండ్లు అమ్ముకునే వారు నిత్యం ఈ మార్కెట్ పై సుమారు 20వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వీరంతా రోజువారి కూలీ పనులు చేసుకుంటారు. తద్వారానే వారి పూట గడుస్తుంది. లాక్‌డౌన్‌తో వీరికి పనిలేకుండా పోయింది.
ఆగిపోయిన దిగుమతులు..
ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు రోజుకు 200 నుంచి 500 ట్రాన్స్‌పోర్టు బండ్లు సరుకు దిగుమతి చేసేవి. లాక్‌డౌన్ ఇతర రాష్ట్రాల నుంచి రవాణ సౌకర్య లేక పోవడంతో సరుకు దిగుమతి అగిపోయింది. ఉన్నవాటికీ రేట్లు పెరిగాయి. అడపా దడపా కొన్ని బండ్లు వచ్చినప్పటికీ ఇక్కడా మార్కెట్‌లో సరుకు దించుకునే వారు లేరు.
హమాలీలకూ ఇబ్బందులు..
హమాలీలు సాధారణ రోజుల్లో రోజు రూ.700నుంచి 1000 సంపాదించేవారు. ఆ డబ్బుతో కుటుంబాని సాకటం తమకు కత్తిమీది సాములా ఉండేదనీ, ఇప్పుడు చాల కష్టమవుతుందని హమాలీ కూలీలు చెబుతున్నారు. తినడానికి బియ్యం లేవు..కొందామంటే డబ్బులు లేవు..ఇంటి కిరాయి చెల్లించ లేదు..ఇంటి యజమాని ఇంటి నుంచి గెట్టివేస్తానంటుండని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.
చిరువ్యాపారుల జీవనం వర్ణనాతీతం..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పొట్టకూటి కోసం మార్కెట్‌లో వడ్డీ వ్యాపారుల వద్ద రోజు వారి వడ్డీకి డబ్బులు తీసుకుంటారు. మార్కెట్‌లో పండ్లు కొనుగోలు చేసి రోడ్లపైన బండ్ల మీద పెట్టుకొని పొద్దాంత విక్రయిస్తారు. విక్రయించాక వచ్చిన డబ్బుల్లో వడ్డీ వ్యాపారుని అసలు వడ్డీ చెల్లించి..మిగిలిన డబ్బులతో జీవనం సాగిస్తున్న వారు హైదరాబాద్ వేలాది మంది ఉన్నారు. ఇప్పడు వీరి బతుకులు దీనమైన స్థితికి చేరాయి. లాక్‌డౌన్ కారణంగా రోడ్ల మీదికి జనాలు ఎవరూ రాక పండ్లు కొనుగోలు చేసేవారు లేరు. తెచ్చిన పండ్లు మూడు నాలుగు రోజులైన అమ్ముడు పోక పాడైపోతున్నయని వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుని డబ్బులు ఎట్లాచెల్లించాలనీ, తమ కుటుంబాన్ని ఎట్లాసాకలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
పూట గడుసుడు కష్టమే..
మార్కెట్‌లో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న. ఇంత తిప్పలు ఎప్పుడు రాలేదు. పనిలేక కుటుంబానికి సాకడానకి తిప్పలు అవుతోంది. పోలీసులు ఇంటి నుంచి బయటికి రానివ్వడం లేదు. ఎట్లానోగట్ల మార్కెట్ వస్తే ఇక్కడా పనిచెప్పేవారు ఎవరు లేరు. బండ్లు రావాడం లేవు. రోజుకు రూ.1000 సంపాదించే మాకు ఇప్పుడు రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేదు. పూటగడవడం లేదు. ప్రభుత్వ బియ్యం ఇస్తామన్నది ఇప్పటికీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాదో ఏమో.. -యాదయ్య, హమాలీ కూలీ,సంగారెడ్డి జిల్లా
ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి
కరోనా వైరస్ వచ్చిందని మార్కెట్‌కు ఎవరూ రావాడం లేరు. మాకు పనిదొరకడం లేదు. పనిచేస్తే పూటగడిచే మా బతుకులు పది రోజుల నుంచి పనులు లేకపోయే సరికి కుటుంబాని సాకడం కష్టమవుతుంది. మాకు ఇక్కడా రేషన్ కార్డులు లేదు. వలస కూలీలకు అందరికి బియం ఇస్తామని ప్రభుత్వం చెప్పుతుంది. కాని మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మా బతుకులను అర్థం చేసుకొని మాకు భరోసా కల్పించాలి. – లక్ష్మీనారాయణ హమాలీ కూలీ, శ్రీకాకుళం జిల్లా
Tags : corona effect, unorganised workers, no food, no work