అన్‌లాక్ 4.0.. మెట్రో సేవలకు ఓకే
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో అన్‌లాక్ 4.0కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కేంద్ర హోంశాఖ శనివారం విడుదల చేసింది. సెప్టెంబర్ 7నుంచి మెట్రో సేవలకు అనుమతినిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే, సెప్టెంబర్ 30వరకు విద్యాసంస్థలు మూసివేయాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా 21వ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వగా, ఆరోజు నుంచి క్రీడలు, వినోదం, రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, 100 మందికి మించకుండా చూసుకోవాలని నిబంధన విధించింది. అలాగే, సెప్టెంబర్ […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో అన్‌లాక్ 4.0కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కేంద్ర హోంశాఖ శనివారం విడుదల చేసింది. సెప్టెంబర్ 7నుంచి మెట్రో సేవలకు అనుమతినిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే, సెప్టెంబర్ 30వరకు విద్యాసంస్థలు మూసివేయాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా 21వ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వగా, ఆరోజు నుంచి క్రీడలు, వినోదం, రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, 100 మందికి మించకుండా చూసుకోవాలని నిబంధన విధించింది.
అలాగే, సెప్టెంబర్ 30 వరకు సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని చెప్పగా, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. కంటైన్ మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30వరకు ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.