ఆఫ్ఘన్ పరిస్థితులపై ఐరాస ఆందోళన

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి పదిరోజుల వ్యవధిలో రెండోసారి సమావేశమయింది. ఆఫ్ఘన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వర్చువల్ పద్ధతిలో సభ్య దేశాలు పాల్గొన్నాయి. సోషల్ మీడియాలో అమెరికా సైనికుడు పోస్ట్ చేసిన చిత్రం పై సమావేశం కొనసాగినట్లు సమాచారం. 150 మంది పట్టే విమానంలో 600 మంది దాకా ఆప్ఘన్ శరణార్థులు రావటం పై వీరు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఐరాస కార్యదర్శి ఆంటోని గుటెరస్ ‘ తిరుగుబాటుదారులు అక్కడి మహిళల, చిన్నారుల హక్కుల […]

Update: 2021-08-18 05:49 GMT

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి పదిరోజుల వ్యవధిలో రెండోసారి సమావేశమయింది. ఆఫ్ఘన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వర్చువల్ పద్ధతిలో సభ్య దేశాలు పాల్గొన్నాయి. సోషల్ మీడియాలో అమెరికా సైనికుడు పోస్ట్ చేసిన చిత్రం పై సమావేశం కొనసాగినట్లు సమాచారం. 150 మంది పట్టే విమానంలో 600 మంది దాకా ఆప్ఘన్ శరణార్థులు రావటం పై వీరు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఐరాస కార్యదర్శి ఆంటోని గుటెరస్ ‘ తిరుగుబాటుదారులు అక్కడి మహిళల, చిన్నారుల హక్కుల కాపాడాలని కోరారు. ప్రపంచం భాదాతప్త హృదయాలతో అక్కడ ఏం జరుగుతుందో పరిశీలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబూల్‌లో ఉన్న అన్ని పార్టీలు సాధారణ పౌరుల హక్కులను కాపాడాలని అభ్యర్థించారు.

‘ నేను తాలిబన్లుతో సహ అందరిని అభ్యర్థిస్తున్నాను, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, హక్కులను , స్వేచ్ఛను కాపాడాలని వేడుకుంటున్నాను’ అని అన్నారు. అక్కడి నుంచి చాలా నివేదికలు అందుతున్నాయి. పౌర సమాజం పై తీవ్రంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలపై దారుణమైన అమానుషలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారి హక్కులు కచ్చితంగా కాపాడాలని చెప్పారు. దీనిపై యూఎన్‌లో ఆప్ఘన్‌ శాశ్వత రాయబారి గులామ్ ఇసాక్ జాయ్ స్పందించారు. తాలిబన్లు చేసిన వాగ్ధానాలు అన్ని విడిచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం పై భారత్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఐరాస‌లో శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ‘ దేశంలో మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో తాలిబన్లు ఇచ్చిన మాటలను పట్టించుకోవటం లేదని అన్నారు.

Tags:    

Similar News