Union Budget 2026-26: బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. విపక్షాల వాకౌట్
2026-25 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

దిశ, వెబ్‌వెస్క్: 2026-25 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman)లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ ఎంపీలో ఆందోళనకు దిగారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సభలో చర్చకు వారు పట్టుబట్టారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు సంయమనం పాటించాలని వారిని వారించారు. దీంతో చేసేదేమి లేక నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం మంత్రి ప్రసంగం కొనసాగుతుండగానే విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.