Union Budget 2025-26: బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. పార్లమెంట్‌కు బయలుదేరిన నిర్మలా సీతారామన్

మరికొద్దిసేపట్లోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్నారు.

Update: 2025-02-01 05:09 GMT
Union Budget 2025-26: బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. పార్లమెంట్‌కు బయలుదేరిన నిర్మలా సీతారామన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్దిసేపట్లోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ భేటీ అయి 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఆమెను ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి నేరుగా రాష్ట్రపతి భవన్ వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బడ్జెట్‌కు సంబంధించి కీలక పత్రాలకు రాష్ట్రపతికి అందజేశారు. అదేవిధంగా బడ్జెట్ వివరాలను ఆమెకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంక్షిప్తంగా వివరించారు. ఈ క్రమంలోనే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి కూడా అనుమతించారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలకు ఆమె మిఠాయి తినిపించారు. అటు నుంచి నేరుగా మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు పార్లమెంట్‌కు బయలుదేరారు.

కాగా, లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్‌లో కేటాయింపులపై పేద, మధ్య తరగతి, వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా యువత, మహిళల, రైతుల కోసం ఎలాంటి పథకాలను కేంద్రం ప్రకటించబోతోంది అనే విషాయాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News