ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

దిశ, వెబ్‎డెస్క్: నేడు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్‌లు పాల్గొన్నారు. రైతుల ఆందోళనలు, వ్యవసాయ చట్టాలపై చర్చించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు అంగీక‌రించిన‌ట్లు సమాచారం. మరోవైపుకొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల‌తో జ‌రిగిన రెండు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. రైతుల […]

Update: 2020-12-05 01:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: నేడు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్‌లు పాల్గొన్నారు. రైతుల ఆందోళనలు, వ్యవసాయ చట్టాలపై చర్చించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు అంగీక‌రించిన‌ట్లు సమాచారం.

మరోవైపుకొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల‌తో జ‌రిగిన రెండు ద‌ఫాల చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. రైతుల ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోని దారుల‌న్నీ మూసివేశారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై కేంద్రం హామీ ఇచ్చినా.. తాము మాత్ర‌ం చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే వ‌ర‌కు ఆందోళనలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News