ముఖ్యమంత్రి పద్ధతి బాగోలేదు.. కిషన్ రెడ్డి ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. హుజురాబాద్ ఓటమిని తట్టుకోలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం సమస్యను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు, విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో […]

Update: 2021-12-19 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. హుజురాబాద్ ఓటమిని తట్టుకోలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం సమస్యను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు, విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని, అది సరైన పద్దతి కాదని హితవు పలికారు.

Tags:    

Similar News