బలమైన శక్తిగా ఎదిగాం : కిషన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా గ్రేటర్‌లో బీజేపీ బలం పుంజుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్ఎస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల తమకు సమయం సరిపోలేదని […]

Update: 2020-12-04 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా గ్రేటర్‌లో బీజేపీ బలం పుంజుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్ఎస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల తమకు సమయం సరిపోలేదని అన్నారు. కాస్త సమయం ఉన్నా మేయర్ పీఠాన్ని దక్కించుకునేవాళ్లం అని తెలిపారు. ఈ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగాం అని అన్నారు. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News