తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలి
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కొవిడ్ -19 టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని సందర్శించి ఆయన, మెడికల్ సిబ్బందితో సంభాషించారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు వైద్యం సేవలు అందిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.216 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అవసరమైతే మరిన్ని […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కొవిడ్ -19 టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని సందర్శించి ఆయన, మెడికల్ సిబ్బందితో సంభాషించారు. ఈ సందర్భంగా కరోనా రోగులకు వైద్యం సేవలు అందిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.216 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అవసరమైతే మరిన్ని నిధులివ్వటానికి సిద్ధమన్నారు. తెలంగాణకు 7లక్షల 14వేల N95 మాస్క్‌లు, 2లక్షల 40వేల పీపీఈ కిట్లు పంపించామన్నారు. ఐసీఎంఆర్ ద్వారా తెలంగాణలో 34ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 1,250 వెంటిలేటర్స్‌లో భాగంగా ఇప్పటికే 688 వెంటిలేటర్స్ అందించామని తెలిపారు.