ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్కు లేదు :కిషన్ రెడ్డి
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. గోల్నాక డివిజన్ అభ్యర్థి కత్తుల సరితకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు గోల్నాకలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని శిలాఫలకం కూడా తీసేశారని మండిపడ్డారు. ఇళ్లు ఎక్కడ కట్టారో.. […]
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. గోల్నాక డివిజన్ అభ్యర్థి కత్తుల సరితకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు గోల్నాకలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.. ఐదేళ్లు పూర్తయినా ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని శిలాఫలకం కూడా తీసేశారని మండిపడ్డారు. ఇళ్లు ఎక్కడ కట్టారో.. ఎవరికి ఇచ్చారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదన్నారు.