రోడ్ షో మధ్యలోనే వెళ్లిపోయిన అమిత్ షా

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా రోడ్ షో మధ్యలోనే ముగిసింది. రోడ్ షోలో ప్రసగించకుండానే అమిత్ షా.. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిపోయారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో కొనసాగాల్సి ఉండగా నామాలగుండు దగ్గర మధ్యలోనే రోడ్ షో ముగించడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం సికింద్రాబాద్ వారసిగూడలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం […]

Update: 2020-11-29 03:20 GMT

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా రోడ్ షో మధ్యలోనే ముగిసింది. రోడ్ షోలో ప్రసగించకుండానే అమిత్ షా.. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిపోయారు. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో కొనసాగాల్సి ఉండగా నామాలగుండు దగ్గర మధ్యలోనే రోడ్ షో ముగించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం సికింద్రాబాద్ వారసిగూడలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. అమిత్ షా రోడ్ షోలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీతాఫల్‌మండి నుంచి వారసిగూడ వరకు రోడ్లన్నీ కాషాయమయం అయ్యాయి. మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ రోడ్ షోలో పాల్గొన్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న తరుణంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరసన చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వారాసిగూడలో బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగుల కుటుంబాలు ప్లకార్డులతో ప్రదర్శన చేశాయి. కానీ, రోడ్లమీదకొచ్చి కాకుండా వారివారి ఇళ్ల ముందే ‘సేవ్ బీఎస్ఎన్ఎల్… గివ్ 4 జీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. దీంతోనే మంత్రి మధ్యలోనే రోడ్ షో ను ముగించుకొని రాష్ట్ర కార్యాలయానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

 

Tags:    

Similar News