కరోనా కట్టడి చర్యలపై అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి.. దాని కట్టడికి ప్రభుత్వ కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ తీసుకుంటున్న చర్యలను ఆయన శనివారం పరిశీలించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖ నుంచి సేకరిస్తూ.. పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తున్నది. ఈ కంట్రోల్ రూమ్ సేవలను పరిశీలిస్తుండగా.. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్ […]

Update: 2020-04-19 01:22 GMT

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి.. దాని కట్టడికి ప్రభుత్వ కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ తీసుకుంటున్న చర్యలను ఆయన శనివారం పరిశీలించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖ నుంచి సేకరిస్తూ.. పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తున్నది. ఈ కంట్రోల్ రూమ్ సేవలను పరిశీలిస్తుండగా.. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్ షాకు అధికారులు వివరించారు. లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సరుకుల డెలివరీలు, వలస కార్మికుల పరిస్థితులను అమిత్ షాకు తెలిపినట్టు సమాచారం. దేశంలో కరోనా కేసులు 15వేల మార్కును దాటగా.. కరోనా మరణాల సంఖ్య 500ను దాటాయి. ఈ వైరస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్ర మంత్రి పరిస్థితులను సమీక్షించారు.

Tags: MHA, union minister, amit shah, control room, covid 19, states, essentials

Tags:    

Similar News