హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో కిషన్‌రెడ్డి భేటీ

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌తో కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీ అని కిషన్‌రెడ్డి చెప్తున్నప్పటికీ నిర్దిష్ట కారణంతోనే కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్వయంగా వెళ్ళి కలవాల్సిన అవసరమే ఉండదని, ప్రత్యేకంగా ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలవాల్సిన సందర్భమే లేదన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవాల్సిన షెడ్యూలు ఖరారు కావడానికి ముందు ఆ […]

Update: 2020-08-02 10:19 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌తో కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీ అని కిషన్‌రెడ్డి చెప్తున్నప్పటికీ నిర్దిష్ట కారణంతోనే కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్వయంగా వెళ్ళి కలవాల్సిన అవసరమే ఉండదని, ప్రత్యేకంగా ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలవాల్సిన సందర్భమే లేదన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవాల్సిన షెడ్యూలు ఖరారు కావడానికి ముందు ఆ సమయానికి మీడియాతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం కానున్నట్లు తెలిపారు. కానీ హఠాత్తుగా మీడియా సమావేశాన్ని రద్దు చేసి సీజేతో భేటీ కావడం ఆ సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందనే గుసగుసలూ మొదలయ్యాయి.

Tags:    

Similar News