నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలి
దిశ, న్యూస్‌బ్యూరో: నకిలీ విత్తనాలతో పుడమికి ప్రమాదమని, సాగు భూములన్నీ విషపు భూములుగా మారే ప్రమాదం ఉందని కేంద్ర వ్యవసాయశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రసాయనాల ఎరువుల వినియోగంతో భూములపై పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పుడు నకిలీ విత్తనాలతో మరింత ఘోరంగా మారుతాయని హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ విత్తనాలు యూఎస్, కెనడా, యూకే, న్యూజిలాండ్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ఇవి సాగు భూములకు అతిపెద్ద హనికరం […]
దిశ, న్యూస్‌బ్యూరో: నకిలీ విత్తనాలతో పుడమికి ప్రమాదమని, సాగు భూములన్నీ విషపు భూములుగా మారే ప్రమాదం ఉందని కేంద్ర వ్యవసాయశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రసాయనాల ఎరువుల వినియోగంతో భూములపై పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పుడు నకిలీ విత్తనాలతో మరింత ఘోరంగా మారుతాయని హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ విత్తనాలు యూఎస్, కెనడా, యూకే, న్యూజిలాండ్, జపాన్‌తో పాటు పలు యూరప్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ఇవి సాగు భూములకు అతిపెద్ద హనికరం కల్పిస్తాయని కేంద్రం పేర్కొంది. దీనిపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని, నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించింది. దీన్ని అతిపెద్ద స్కాంగా తీసుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తుల స్మగ్గింగ్‌గా భావించాలని పేర్కొంది. చాలా రాష్ట్రాలు నకిలీ విత్తనాలను అరికట్టడంతో విఫలమవుతున్నాయని, రాష్ట్రాలు వీటిపై దృష్టి పెట్టాలని లేఖలో పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాలు, వ్యవసాయ యూనివర్సిటీలు, సీడ్స్ అసోసియేషన్లు, విత్తన ధృవీకరణ సంస్థలు, ఐసీఏఆర్ సంస్థలు సంయుక్తంగా నకిలీ విత్తనాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. విత్తనాల వినియోగంపై పరిశోధనలు నిర్వహించాలని సూచించాయి.
కాగా రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని ఇప్పటికే ఫిర్యాదులున్నాయి. చాలా ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్లు పిలిచి కొనుగోలు చేసిన విత్తనాలే నకిలీగా తేలుతున్నాయి. ఇటీవల సోయాబీన్ విత్తనాల వ్యవహారం వ్యవసాయ శాఖను ఇరుకున పడేసింది. దీనిపై పలువురు ఫిర్యాదులు చేశారు. విత్తన సంస్థలు ఎలాంటి నిర్ధారణ లేకుండా కంపెనీలకు టెండర్లు అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు నకిలీ విత్తనాలతో సాగు భూములపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది.