ఇంటిముందు పార్క్ చేసిన బండి దహనం

దిశ, లింగాల: నాగర్‌ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని వడ్డె రాయవరం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య వివరాల ప్రకారం.. వడ్డె రాయవరం గ్రామానికి చెందిన పసుపుల బాలకృష్ణ అనే వ్యక్తి రోజులాగే వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికొచ్చి తన బైకును(TS31G7260) ఇంటి ఎదుట పార్క్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో టైరు కాలుతున్న వాసన రావడంతో […]

Update: 2021-11-27 08:52 GMT

దిశ, లింగాల: నాగర్‌ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని వడ్డె రాయవరం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య వివరాల ప్రకారం.. వడ్డె రాయవరం గ్రామానికి చెందిన పసుపుల బాలకృష్ణ అనే వ్యక్తి రోజులాగే వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికొచ్చి తన బైకును(TS31G7260) ఇంటి ఎదుట పార్క్ చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో టైరు కాలుతున్న వాసన రావడంతో బయటికి వచ్చి చూశారు. ఈ క్రమంలో తన బైకు మంటల్లో కాలుతుండగా కుటుంబసభ్యుల సాయంతో మంటలు ఆర్పాడు. అప్పటికే వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఎవరో కావాలనే నా బైకుకు నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాలకృష్ణ కొడుకు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కృష్ణయ్య దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..