భారత్, పాక్ ఒకే అంటే.. ఆ సమస్య పరిష్కరిస్తాం
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి తాను సిద్ధమేనని ఐరాస జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన వొల్కన్ బొజ్కిర్ అన్నారు. ఇరు దేశాలు తన సహాయం కోరితే అందుకు తాను సిద్ధంగా ఉంటానని వివరించారు. కశ్మీర్ సమస్య పరిష్కృతం కావడం దక్షిణాసియాకు కీలకమని పేర్కొన్నారు. యూఎన్‌జీఏ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బొజ్కిర్ రెండు రోజులు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. కశ్మీర్ సమస్యపై ఐరాస తన పాత్ర పోషించాలని పాక్ పీఎం […]
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి తాను సిద్ధమేనని ఐరాస జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన వొల్కన్ బొజ్కిర్ అన్నారు. ఇరు దేశాలు తన సహాయం కోరితే అందుకు తాను సిద్ధంగా ఉంటానని వివరించారు. కశ్మీర్ సమస్య పరిష్కృతం కావడం దక్షిణాసియాకు కీలకమని పేర్కొన్నారు.
యూఎన్‌జీఏ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బొజ్కిర్ రెండు రోజులు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. కశ్మీర్ సమస్యపై ఐరాస తన పాత్ర పోషించాలని పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న నేపథ్యంలో బొజ్కిర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆది నుంచీ కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని, మధ్యవర్తిత్వం ప్రసక్తే అనవసరమని భారత్ వాదిస్తున్నసంగతి తెలిసిందే.