కనీవిని ఎరుగని రీతిలో ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’
దిశ, తెలంగాణ బ్యూరో: కనీవిని ఎరుగని రీతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి తెలిపారు. శనివారం పాదయాత్రకు సంబంధించిన అంశాలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన 30 కమిటీల పనితీరుపై సమీక్షలు చేపట్టామని వివరించారు. టీఆర్ఎస్ పాలనలో మోసపోయిన వర్గాలన్నింటినీ పాదయాత్ర ద్వారా కలుసుకుని ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పేరుతో సీఎం […]
దిశ, తెలంగాణ బ్యూరో: కనీవిని ఎరుగని రీతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి తెలిపారు. శనివారం పాదయాత్రకు సంబంధించిన అంశాలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన 30 కమిటీల పనితీరుపై సమీక్షలు చేపట్టామని వివరించారు. టీఆర్ఎస్ పాలనలో మోసపోయిన వర్గాలన్నింటినీ పాదయాత్ర ద్వారా కలుసుకుని ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయిన కుల సంఘాల పెద్దలందరినీ కలిసి పాదయాత్రకు సంఘీభావం కోరుతామన్నారు.
నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు నిరుద్యోగ సంఘాలను కలిసి పాదయాత్రకు సంఘీభావం కోరుతామన్నారు. భూసేకరణ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి పెండింగ్ పనులను పూర్తి చేయడం వంటి స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఛైతన్యం పరుస్తామన్నారు. పాదయాత్రను పరిశీలించేందుకు సెంట్రల్ కమిటీ నుండి నలుగురు నాయకులను రాష్ట్రానికి రానున్నరని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు హాజరై సంఘీభావం తెలిపేలా కార్యాచరణ రూపొందించామన్నారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన 30 కమిటీలను 5 క్లస్టర్లుగా విభజించామని చెప్పారు. 25 మంది కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రెండు, మూడు రోజుల్లో వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు. 300 మంది విద్యార్థులకు పాదయాత్ర ఉద్దేశం, లక్షాలను వివరించేలా శిక్షణ తరగతుు నిర్వహిస్తామన్నారు. తొలిదశ పాదయాత్ర 7 జిల్లాల గూండా సాగుతున్నందున ఆయా జిల్లాల నాయకులతోనూ పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ లు ఎప్పటికప్పుడు సమావేశమై పనితీరును అడిగి తెలుసుకుంటామన్నారు.