‘నిరుద్యోగులు అలసిపోయి తనువు చాలించుకుంటున్నరు’

దిశ, భువనగిరి రూరల్: తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న హత్యలుగానే భావిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండి బబ్లు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్‌లు పాల్గొని మాట్లాడుతూ… నీళ్లు, […]

Update: 2021-08-03 06:14 GMT

దిశ, భువనగిరి రూరల్: తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న హత్యలుగానే భావిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండి బబ్లు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్‌లు పాల్గొని మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. ఏడున్నర సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం చూసి చూసి అలసిపోయి ఆశలు చాలించుకున్న నిరుద్యోగులు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల వరంగల్‌లో సునీల్ నాయక్ ఘటన మరువకముందే, నిన్న మునుగోడులో శ్రీకాంత్, వనపర్తిలో కొండల్, హుజురాబాద్‌లో షబ్బిర్‌లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. నిరుద్యోగులంతా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేవరకూ ఎదురు చూడాలని, కేసీఆర్ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, మైనార్టీ సెల్ నాయకులు ఎండీ షరీఫ్, ఎండీ రఫీయోద్దిన్, కౌన్సిలర్స్ వడిచెర్ల కృష్ణ యాదవ్, ఎండీ సలావుద్దీన్, నాయకులు సోమయ్య, ఎండీ నజీర్, మాచర్ల వినయ్, ముచ్చాల మనోజ్, కాకునూరి మహేందర్, జువ్వగాని శ్రీధర్, బురాన్, సుర్పంగ చందు, శరత్, దండు నరేశ్, గ్యాస్ చిన్నా, డాకూరి ప్రకాశ్, దర్గాయి దేవేందర్, ఎండీ సమీర్, ఎండీ కబీర్‌లు పాల్గొన్నారు.

Tags:    

Similar News