ఆస్పత్రులు కంపు.. కోవిడ్‌కు ఇంపు…
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్భన్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్‌కేర్ సిబ్బంది ఆరు రోజులుగా విధులను బహిష్కరించడంతో కంపు కొడుతున్నాయి. పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఐసీయూల్లోకి కూడా జనం ఎలా పడితే అలా వెళ్లి వస్తున్నారు. అలాగే షేషంట్లకు కేర్ టేకర్లు లేకపోవడంతో రోగుల కుటుంబాలే నిత్యం వెంట ఉండాల్సి వస్తోంది. ఎంజీఎంకు నిత్యం నాలుగైదు వేల మంది రోగులు వచ్చి పోతుంటారు. […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్భన్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్‌కేర్ సిబ్బంది ఆరు రోజులుగా విధులను బహిష్కరించడంతో కంపు కొడుతున్నాయి. పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఐసీయూల్లోకి కూడా జనం ఎలా పడితే అలా వెళ్లి వస్తున్నారు. అలాగే షేషంట్లకు కేర్ టేకర్లు లేకపోవడంతో రోగుల కుటుంబాలే నిత్యం వెంట ఉండాల్సి వస్తోంది.
ఎంజీఎంకు నిత్యం నాలుగైదు వేల మంది రోగులు వచ్చి పోతుంటారు. ఇన్‌పేషట్ల సంఖ్య కూడా వందల్లో ఉంటుంది. ఈక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో జనం గుంపులు గుంపులుగా వార్డుల్లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో కోవిడ్ ప్రబలే అవకాశం ఉందన్న టెన్షన్ వైద్యులే వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రి ఆవరణల్లోనే కాదు.. ఐసీయూ గదుల ముందు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
ఆయా ఆస్పత్రుల అధికారులు సమస్యను శాఖ ఉన్నతాధికారులపై తోసేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులూ దీక్షల్లో కూర్చున్న మూడు విభాగాల సిబ్బందికి మద్దతు తెలిపి, పరిష్కరిస్తామని చెప్పి.. ఆ తర్వాత ముఖం కూడా చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు రోజులుగా చర్చలు సానుకూల దిశగా సాగకపోవడం గమనార్హం. దీంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య రక్షణ కరువైందన్న విమర్శలు రోగులు, వారి బంధువుల నుంచి వినిపిస్తున్నాయి.