విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయలేకపోయా.. బాధపడుతున్న తమన్నా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల సరసన నటించి, తన అందం, డాన్స్, అద్భుతమైన నటనతో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌కు మరింతగా సంపాదించుకుంది. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటి వరకు ఒక్క లిప్ లాక్ సీన్స్ చేయలేదు. కానీ మొదటి సారి ‘‘లస్ట్ స్టోరీస్ 2’’ సినిమా కోసం తన పద్ధతులన్నీ పక్కన పెట్టి, తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో బోల్డ్ రొమాన్నతో రెచ్చిపోతుంది. ఇప్పటికి తమన్నా రొమాన్స్ సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో బైట్ విడుదల చేశారు. ఈ సిరీస్‌లో నా కోస్టార్ ఎవరు అని తమన్నా అడగ్గా.. విజయ్ అని సమాధానం ఇస్తారు. దీంతో తమన్నా ఎంతో ఆశతో విజయ్ దేవరకొండనా? అని వెంటనే రెస్పాండ్ అవుతుంది. కానీ విజయ్ వర్మ అని చెప్పగానే సైలెంట్ అయిపోతుంది. దీంతో నెటిజన్లు ‘‘రౌడీ హీరోతో అలాంటి సీన్స్ చేయాలనుకున్నట్లుంది పాపం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో తమన్నా, విజయ్ వర్మతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీ, నీనా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: బోల్డ్ మీమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న తమన్నా.. ఇంత దారుణమా!
గోవాలో హోటల్ పెట్టిన బోల్డ్ బ్యూటీ.. వాళ్లకోసం ప్రత్యేక వసతులున్నాయట