అప్పాజిపేటలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

దిశ, నల్లగొండ: అప్పుల బాధ భరించలేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాజిపేట గ్రామంలో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే రైతుకు తనకున్న రెండెకరాల భూమిలో పత్తిసాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటలు సరిగా పండక పోవడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు అధికం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. […]

Update: 2021-08-31 11:43 GMT

దిశ, నల్లగొండ: అప్పుల బాధ భరించలేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పాజిపేట గ్రామంలో మంగళవారం జరిగింది. రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే రైతుకు తనకున్న రెండెకరాల భూమిలో పత్తిసాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటలు సరిగా పండక పోవడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు అధికం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాదాపుగా రూ.5 లక్షల వరకు అప్పులు కావడం, వడ్డీలు అధికమవడంతో మనోవేధనకు గురై పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకున్నాడు. మధుసూదన్ రెడ్డి భార్య పొలం దగ్గరకు వచ్చి చూడగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Tags:    

Similar News