మాస్కే కాదు.. గొడుగు తప్పనిసరి అక్కడ!

కరోనా నియంత్రణలో సామాజిక దూరం పాటించడం అత్యవసరం. అయితే ఈ విషయాన్ని ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ప్రజలు మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడంతో పాటు గొడుగును వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. కేరళలోని అలపుళ సమీపంలో ఉన్న తన్నీర్ ముక్కోమ్ గ్రామ పంచాయతీ.. గొడుగులను విధిగా వాడాలని తీర్మానం చేసింది. […]

Update: 2020-04-28 22:12 GMT

కరోనా నియంత్రణలో సామాజిక దూరం పాటించడం అత్యవసరం. అయితే ఈ విషయాన్ని ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ప్రజలు మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడంతో పాటు గొడుగును వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. కేరళలోని అలపుళ సమీపంలో ఉన్న తన్నీర్ ముక్కోమ్ గ్రామ పంచాయతీ.. గొడుగులను విధిగా వాడాలని తీర్మానం చేసింది. ప్రతి ఒక్కరు గొడుగు వాడితే వ్యక్తుల మధ్య కనీసం మీటర్ ఉంటుందని పంచాయతీ అధికారులు భావించి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
గొడుగులు కొనుగోలు చేయలేని వారి కోసం సగం ధరకే పంపిణీ చేస్తున్నారు అక్కడి పంచాయతీ అధికారులు. ఈ గొడుగు కాన్సెప్ట్ మంచి ఫలితాలను రాబడుతోందని ఆ రాష్ట్ర మంత్రి థామస్ ఇసాక్ ట్వీట్ చేశారు. గొడుగుల వాడితే వ్యక్తుల మధ్య కచ్చితంగా మీటర్ దూరం ఉంటుందన్నారు.

Tags: umbrella, Thanneer Pakom Gram Panchayat, kerala, social distance

Tags:    

Similar News