రొనాల్డోపై యూరో కప్ డైరెక్టర్ ఫైర్.. బాటిల్స్ జరపొద్దని వార్నింగ్
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020లో ‘బాటిల్ గేట్’కు నిర్వాహక కమిటీ చెక్ పెట్టింది. హంగేరీతో జరిగిన మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కోకా కోలా బాటిల్స్ పక్కకు పెట్టాడు. అనంతరం ‘వాటర్ తాగండి’ అంటూ నినదించాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ ప్లేయర్ పాల్ పాబో హెనికెన్ బీర్ బాటిల్స్ పక్కకు పెట్టాడు. అయితే యూరో కప్ 2020నే కాకుండా యూఈఎఫ్ఏకు ఎప్పటి నుంచో స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఎంఎన్‌సీ కంపెనీల […]
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020లో ‘బాటిల్ గేట్’కు నిర్వాహక కమిటీ చెక్ పెట్టింది. హంగేరీతో జరిగిన మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కోకా కోలా బాటిల్స్ పక్కకు పెట్టాడు. అనంతరం ‘వాటర్ తాగండి’ అంటూ నినదించాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ ప్లేయర్ పాల్ పాబో హెనికెన్ బీర్ బాటిల్స్ పక్కకు పెట్టాడు. అయితే యూరో కప్ 2020నే కాకుండా యూఈఎఫ్ఏకు ఎప్పటి నుంచో స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఎంఎన్‌సీ కంపెనీల ప్రతిష్టకు భంగం కలిగేలా ఆటగాళ్లు ప్రవర్తించడంతో నిర్వాహక కమిటీ రంగంలోకి దిగింది.
యూరో 2020 డైరెక్టర్ మార్టిన్ కల్లెన్ అన్ని జట్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై మీడియా సమావేశాల్లో పెట్టే బాటిల్స్ పక్కకు జరపడం వంటి చర్యలకు పూనుకుంటే ఆయా జట్ల అసోసియేషన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాల్ పాబో మతపరమైన సమస్యల కారణంగా బాటిల్ పక్కన పెట్టాడు. కానీ రొనాల్డో తన వ్యక్తిగత కారణాలతో బాటిల్స్ జరపడాన్ని యూరో 2020 తీవ్రంగా పరిగణించిందని మార్టిన్ చెప్పారు. ఇకపై ఇలాంటి వాటిపై జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు.