ఇంజనీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఉబెర్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో పనిచేసేందుకు ఇంజనీర్ల నియామకాలు చేపడుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయంగా ఇంజనీరింగ్‌తో పాటు ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను నియమించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నియామకాల ద్వారా సంస్థ డెలివరీ, డిజిటల్ పేమెంట్, డ్రైవర్ వృద్ధి, ఉబెర్ ఈట్స్, మౌలిక సదుపాయాలు, యాడ్‌టెక్, భద్రత, ఫైనాన్స్ టెక్నాలజీ విభాగలను మరింత పటిష్టం చేసేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. ఈ విభాగాల్లో తీసుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో పనిచేసేందుకు ఇంజనీర్ల నియామకాలు చేపడుతున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయంగా ఇంజనీరింగ్‌తో పాటు ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను నియమించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నియామకాల ద్వారా సంస్థ డెలివరీ, డిజిటల్ పేమెంట్, డ్రైవర్ వృద్ధి, ఉబెర్ ఈట్స్, మౌలిక సదుపాయాలు, యాడ్‌టెక్, భద్రత, ఫైనాన్స్ టెక్నాలజీ విభాగలను మరింత పటిష్టం చేసేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. ఈ విభాగాల్లో తీసుకున్న వారిని హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో డిమాండ్‌కు అనుగుణంగా ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.
కంపెనీ తన మొబిలిటీ, డెలివరీలను మరింత ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ విస్తరణ ప్రణాళిక చేపడుతోంది. అంతర్జాతీయంగా 10 వేలకు పైగా నగరాల్లోని రవాణాలో కీలకంగ ఉండాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. నిపుణులైన ఇంజనీర్లను నియమించడం ద్వారా అంతర్జాతీయంగా ఎక్కువమందికి సేవలందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని ఉబెర్ సంస్థ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మణికందన్ వెల్లడించారు.