ఇకపై ఈ ప్రాంతంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ‘గంజాయి’ అమ్మకం..
దిశ, ఫీచర్స్: కెనడాలో అంటారియోలోని వినియోగదారులు ‘ఉబెర్ ఈట్స్’ యాప్‌లో గంజాయి కోసం ఆర్డర్లు చేసేందుకు ఉబెర్ సంస్థ అనుమతిస్తుంది. Uber Eats సోమవారం తన మార్కెట్‌లో గంజాయి రిటైలర్ టోక్యో స్మోక్‌ను జాబితా చేయడంతో వాటికోసం ఆర్డర్స్ పెరిగినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే తన ఈట్స్ యూనిట్ ద్వారా మద్యాన్ని డెలివరీ చేస్తున్న ఈ ఫుడ్ డెలీవర్ యాప్, గత కొంతకాలంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న గంజాయి మార్కెట్‌పై దృష్టి పెట్టింది. మత్తు పదార్థమైన గంజాయిని […]
దిశ, ఫీచర్స్: కెనడాలో అంటారియోలోని వినియోగదారులు ‘ఉబెర్ ఈట్స్’ యాప్‌లో గంజాయి కోసం ఆర్డర్లు చేసేందుకు ఉబెర్ సంస్థ అనుమతిస్తుంది. Uber Eats సోమవారం తన మార్కెట్‌లో గంజాయి రిటైలర్ టోక్యో స్మోక్‌ను జాబితా చేయడంతో వాటికోసం ఆర్డర్స్ పెరిగినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే తన ఈట్స్ యూనిట్ ద్వారా మద్యాన్ని డెలివరీ చేస్తున్న ఈ ఫుడ్ డెలీవర్ యాప్, గత కొంతకాలంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న గంజాయి మార్కెట్‌పై దృష్టి పెట్టింది.
మత్తు పదార్థమైన గంజాయిని వినోద అవసరాల కోసం ఉపయోగించుకొనేందుకు అవకాశం కల్పించే చట్టానికి కెనడా పార్లమెంట్ 2018లో ఆమోదించింది. 2013లో ఉరుగ్వే మొదటిసారిగా గంజాయిని చట్టబద్ధం చేసిన దేశంగా గుర్తింపు పొందగా, కెనడా ఆ జాబితాలో రెండోస్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ఇందుకు అనుమతిస్తుండగా.. చట్ట ప్రకారం లైసెన్స్ పొందిన ఉత్పత్తిదారులు పండించే గంజాయిని కెనడా పౌరులు కొనుగోలు చేయొచ్చు.
అంతేకాదు ప్రతీ ఇంట్లో నాలుగు గంజాయి మొక్కలు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. వయోజనులు 30 గ్రాముల వరకు గంజాయిని కలిగి ఉండొచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుక్కునే అవకాశం కూడా ఉంది. అయితే ఇంత చేసినా.. అక్రమ మార్కెట్ ద్వారానే గంజాయి సేల్స్ అధికంగా ఉండటం ప్రభుత్వాన్ని కలవరపెట్టే అంశం. ఈ క్రమంలో ఉబెర్ ఈట్స్ నిర్ణయం.. కెనడియన్ పౌరులకు సురక్షితమైన, చట్టబద్ధమైన గంజాయిని కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం మొత్తం వైద్యేతర గంజాయి అమ్మకాల్లో 40 శాతానికి పైగా ఉన్న అక్రమ మార్కెట్‌ను ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతుందని ఉబెర్ అభిప్రాయపడింది.
పరిశోధనా సంస్థ BDS Analytics డేటా ప్రకారం.. కెనడాలో గంజాయి విక్రయాలు 2021లో మొత్తం $4 బిలియన్లు (దాదాపు రూ. 29,785 కోట్లు) కాగా ఈ అమ్మకాలు 2026లో $6.7 బిలియన్లకు (దాదాపు రూ. 49,890 కోట్లు) పెరుగుతాయని అంచనా వేశారు.