మార్స్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన యూఏఈ

టోక్యో: అంగారక గ్రహం మీదకు అరబ్ ప్రపంచం నుంచి తొలి మిషన్‌ను యూఏఈ విజయవంతంగా ప్రయోగించింది. రెడ్ ప్లానెట్ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించే లక్ష్యంతో ఈ ప్రోబ్‌ను జపాన్ సహాయంతో అంతరిక్షంలోకి పంపింది. జపాన్ కాలమానం ప్రకారం, ఉదయం 6.58 గంటలకు దక్షిణ జపాన్‌లోని తనెగషిమా స్పేస్ సెంటర్ నుంచి ‘అల్-అమాల్’ ప్రోబ్‌ను జపనీస్ రాకెట్ విజయవంతంగా మోసుకెళ్లింది. నిర్దేశించుకున్న ప్రణాళిక అనుగుణంగా రాకెట్ నుంచి అల్-అమాల్ వేరైందని అధికారులు వెల్లడించారు. దుబాయ్‌లోని గ్రౌండ్ సెగ్మెంట్‌‌లో ఈ […]

Update: 2020-07-20 05:39 GMT

టోక్యో: అంగారక గ్రహం మీదకు అరబ్ ప్రపంచం నుంచి తొలి మిషన్‌ను యూఏఈ విజయవంతంగా ప్రయోగించింది. రెడ్ ప్లానెట్ వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించే లక్ష్యంతో ఈ ప్రోబ్‌ను జపాన్ సహాయంతో అంతరిక్షంలోకి పంపింది. జపాన్ కాలమానం ప్రకారం, ఉదయం 6.58 గంటలకు దక్షిణ జపాన్‌లోని తనెగషిమా స్పేస్ సెంటర్ నుంచి ‘అల్-అమాల్’ ప్రోబ్‌ను జపనీస్ రాకెట్ విజయవంతంగా మోసుకెళ్లింది. నిర్దేశించుకున్న ప్రణాళిక అనుగుణంగా రాకెట్ నుంచి అల్-అమాల్ వేరైందని అధికారులు వెల్లడించారు.

దుబాయ్‌లోని గ్రౌండ్ సెగ్మెంట్‌‌లో ఈ ప్రోబ్ రెండువైపులా కమ్యూనికేషన్‌‌ను స్థాపించుకుందని తెలిపారు. మార్స్ గ్రహం కక్ష్యలోకి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21(ఏడు ఎమిరేట్లు ఏకమై యూఏఈగా మారిన రోజు) కల్లా చేరనుందని, ఆ ఏడాది సెప్టెంబర్ వరకు డేటాను భూమికి పంపించనుందని వెల్లడించారు. ఈ అల్-అమాల్ మార్స్ పైన ల్యాండ్ కాబోదని, కానీ, దాని కక్ష్యలోనే తిరనుంది. అంగారక గ్రహం ఒక భ్రమణం చెందే కాలం అంటే మార్స్ ఏడాది(687 రోజులు) ఆ కక్ష్యలోనే ఉండి, అన్ని సీజన్‌లలో దాని వాతావరణాన్ని పరిశీలించి డేటాను పంపిస్తుందని వివరించారు. ఈ సమాచారం ప్రపంచ శాస్త్రజ్ఞులందరికీ అందుబాటులో ఉంటుందని మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒమ్రాన్ షరఫ్ అన్నారు. వాతావరణ సమస్యల కారణంగా ఈ మిషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News