తెలంగాణకు మరో ముప్పు.. టెస్టులు తప్పనిసరా..?
దిశ, తెలంగాణ బ్యూరో : జ్వరం, వాంతులు, నీరసం ఉన్నోళ్లందరికీ టైఫాయిడ్ టెస్టులను తప్పనిసరిగా చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తారంగా కురిసిన వానల వలన నీరు కలుషితమై టైఫాయిడ్, వైరల్ఫీవర్లు పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీజనల్‌వ్యాధులపై అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని, సీజనల్‌వ్యాధులను కూడా నియంత్రించేందుకు మరిన్ని రోజులు శ్రమించాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల కంటే అర్బన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : జ్వరం, వాంతులు, నీరసం ఉన్నోళ్లందరికీ టైఫాయిడ్ టెస్టులను తప్పనిసరిగా చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తారంగా కురిసిన వానల వలన నీరు కలుషితమై టైఫాయిడ్, వైరల్ఫీవర్లు పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీజనల్‌వ్యాధులపై అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని, సీజనల్‌వ్యాధులను కూడా నియంత్రించేందుకు మరిన్ని రోజులు శ్రమించాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల కంటే అర్బన్ ప్రాంతాల్లో ఫోకస్పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
గత కొన్ని రోజుల నుంచి సీజనల్ జ్వరాలు అర్బన్‌లోనే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయన్నారు. దీంతో ప్రత్యేక క్యాంపులు పెట్టి టైఫాయిడ్, మలేరియా, డెంగీతో పాటు విషజ్వరాల శాంపిల్స్నుసేకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఇప్పటికే నిర్ధారణ కిట్లను కూడా ప్రతీ పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచామన్నారు. శాంపిల్సంఖ్య పెరిగితే తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపించాలన్నారు.
ఇదిలా ఉండగా రాష్ర్ట వ్యాప్తంగా సీజనల్వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత రెండు నెలల నుంచి డెంగీ తీవ్రత కొనసాగుతుండగా, వారం రోజుల నుంచి టైఫాయిడ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రతి రోజు వేడి ఆహారం, గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నది. సీజనల్వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, లక్షణాలున్నోళ్లంతా వెంటనే వ్యాధి నిర్ధారణకు వెళ్లాలని స్పష్టం చేసింది.