టైప్ రైటింగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
దిశ, తెలంగాణ బ్యూరో : టైప్ రైటింగ్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించిందని, డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ రికాగ్నాస్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ గౌరవాధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలిగ సతీష్ బాబు తెలిపారు. ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. టైప్ రైటింగ్ నేర్చుకుని పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు గమనించాలని సూచించారు. ఆన్లైన్లో డిసెంబర్ 29 వరకు రూ.650 ఫీజు […]
దిశ, తెలంగాణ బ్యూరో : టైప్ రైటింగ్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించిందని, డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ రికాగ్నాస్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ గౌరవాధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలిగ సతీష్ బాబు తెలిపారు. ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. టైప్ రైటింగ్ నేర్చుకుని పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు గమనించాలని సూచించారు. ఆన్లైన్లో డిసెంబర్ 29 వరకు రూ.650 ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.400 అదనపు రుసుముతో డిసెంబర్ 30 వరకు అవకాశం ఉందని, అండర్ తత్కాల్ రెండు వేల రూపాయలతో డిసెంబర్ 31, అండర్ ప్రీమియం రూ.5వేలు చెల్లించి పరీక్ష ముందు రోజు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తేదీ మార్పులను అభ్యర్థులు గమనించి సూచించారు.