రెండువేల మంది ‘మహా’ పోలీసులకు కరోనా

ముంబయి: మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు 2,000 మార్కును దాటాయి. గురువారం నాటికి 2,095 మంది పోలీసులకు కరోనా సోకినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్ అధికారుల వివరాల ప్రకారం.. 236 మంది పోలీసు అధికారులు, 1,859 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ తేలింది. ఇందులో 75 మంది అధికారులు, 822 మంది కానిస్టేబుళ్లు(మొత్తం 897 మంది పోలీసులు) వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా, 22 మంది పోలీసులు మరణించారు. గురువారం నాటికి మహారాష్ట్రలోని […]

Update: 2020-05-28 05:42 GMT

ముంబయి: మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు 2,000 మార్కును దాటాయి. గురువారం నాటికి 2,095 మంది పోలీసులకు కరోనా సోకినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్ అధికారుల వివరాల ప్రకారం.. 236 మంది పోలీసు అధికారులు, 1,859 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ తేలింది. ఇందులో 75 మంది అధికారులు, 822 మంది కానిస్టేబుళ్లు(మొత్తం 897 మంది పోలీసులు) వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా, 22 మంది పోలీసులు మరణించారు. గురువారం నాటికి మహారాష్ట్రలోని మొత్తం కేసుల్లో(సుమారు 57వేలు) 3.6శాతం పోలీసుల్లోనే నమోదు కావడం గమనార్హం.

Tags:    

Similar News