ప్రాణం తీసిన ఈత సరదా.. ప్రమాదవ శాత్తు ఇద్దరు మృతి
దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము కుమ్మరి కుంట చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో అమీన్ పూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సరదాగా చేపలు పట్టేందుకు వినియోగించే పుట్టిలో కూర్చొని చెరువులోకి ఐదు మంది యువకులు వెళ్లారు. చెరువు మధ్యలో పుట్టి మునగడంతో, నీట మునగిన ఐదుగురు యువకుల్లో పవన్ (34), నర్సింహులు (36) […]
దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము కుమ్మరి కుంట చెరువులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో అమీన్ పూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సరదాగా చేపలు పట్టేందుకు వినియోగించే పుట్టిలో కూర్చొని చెరువులోకి ఐదు మంది యువకులు వెళ్లారు. చెరువు మధ్యలో పుట్టి మునగడంతో, నీట మునగిన ఐదుగురు యువకుల్లో పవన్ (34), నర్సింహులు (36) మృతి చెందారు.
ఒడ్డుకు చేరుకున్న మరో ముగ్గురు యువకులు స్థానికులకు జరిగిన విషయం తెలుపగా, వారు అమీన్ పూర్ పోలీసు లకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చెరువులో పవన్ మృతదేహాన్ని బయటకు తీశారు. నీట మునిగిన నర్సింహులు మృతదేహం కోసం చెరువులో గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చనిపోయిన ఇద్దరు యువకులు అమీన్ పూర్ వాసులుగా గుర్తించిన పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పవన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నరసింహులు జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా మృతిచెందిన యువకుడి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.