నల్లమలలో మరో రెండు కరోనా కేసులు

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతంలోని కొత్తపల్లి మరియు బికే తిరుమలాపూర్ గ్రామాల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యాధికారులు శుక్రవారం వెల్లడించారు. పై గ్రామాలలో వైద్య సిబ్బంది, పోలీసులు, మరియు ఆశావర్కర్లు బాధిత ఇంటి వద్దకు వెళ్లి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారం రోజుల క్రితం అదే ప్రాజెక్టులో విధులు […]

Update: 2020-07-24 05:13 GMT

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతంలోని కొత్తపల్లి మరియు బికే తిరుమలాపూర్ గ్రామాల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు జిల్లా వైద్యాధికారులు శుక్రవారం వెల్లడించారు. పై గ్రామాలలో వైద్య సిబ్బంది, పోలీసులు, మరియు ఆశావర్కర్లు బాధిత ఇంటి వద్దకు వెళ్లి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారం రోజుల క్రితం అదే ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తదుపరి ఆ వ్యక్తికి ప్రైమరీ కాంటాక్టయిన వ్యక్తులను పరీక్షలు చేయగా, కొత్తపల్లి గ్రామానికి చెందిన మరో ఉద్యోగికి కరోనా సోకినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఇదే మండలంలోని బికే తిరుమలాపూర్ గ్రామానికి చెందిన చిరు వ్యాపారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అమ్రాబాద్ మరియు మన్ననూర్ డాక్టర్లు అరుణ, గౌతమ్‌లు తమ సిబ్బందితో పాజిటివ్ వ్యక్తుల గృహాలను సందర్శించి హోమ్ క్వారంటైన్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని గుర్తుచేశారు. వ్యాధికి సంబంధించిన మందులను అందజేసి ఇంటి చుట్టూ, శానిటేషన్ చేయించారు. పాజిటివ్ కేసులు నమోదు అయినంత మాత్రాన ఎవరూ కూడా ఆందోళన చెందకూడదని, సామాజిక దూరం, మాస్కులు మరియు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.

Tags:    

Similar News