కరోనాపై విజయం సాధించిన 2 నెలల పసికందు
దిశ, వెబ్ డెస్క్: ఇటలీలో రెండు నెలల పసికందు కరోనా వైరస్(కోవిడ్-19) తో పోరాడి చివరకు విజయం సాధించింది. విషయమేమిటంటే.. ఈ పసికందుకు కరోనా సోకడంతో గతనెల 18 నుంచి బారీలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారి మెల్లమెల్లగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ ఆస్పత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి వెల్లడించిందని అక్కడి మీడియా కథనాలు […]
దిశ, వెబ్ డెస్క్: ఇటలీలో రెండు నెలల పసికందు కరోనా వైరస్(కోవిడ్-19) తో పోరాడి చివరకు విజయం సాధించింది. విషయమేమిటంటే.. ఈ పసికందుకు కరోనా సోకడంతో గతనెల 18 నుంచి బారీలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారి మెల్లమెల్లగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ ఆస్పత్రి డాక్టర్లు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లి వెల్లడించిందని అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తున్నది.
Tags: corona, 2 months baby, hospital, Recovered