రిజర్వాయర్‌లో పడి ఇద్దరి మృతి.. మరొకరు?
దిశ, వరంగల్: అన్యంపుణ్యం ఎరుగని ఆ బాలురు అకాల మరణం పొందారు. సరదాగా చేసిన సైకిల్ సవారీ వారి పాలిట యమపాశంగా మారింది. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని బీమారంలో గల పుట్టలమ్మ రిజర్వాయర్ వెంబడి సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అదుపు తప్పి నీటిలో పడ్డారు. ఈత రాకపోవడంతో ముగ్గురికి ముగ్గురు గల్లంతు అయ్యారు. ఈ సమాచారం అందుకున్న కేయూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక […]
దిశ, వరంగల్: అన్యంపుణ్యం ఎరుగని ఆ బాలురు అకాల మరణం పొందారు. సరదాగా చేసిన సైకిల్ సవారీ వారి పాలిట యమపాశంగా మారింది. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని బీమారంలో గల పుట్టలమ్మ రిజర్వాయర్ వెంబడి సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అదుపు తప్పి నీటిలో పడ్డారు. ఈత రాకపోవడంతో ముగ్గురికి ముగ్గురు గల్లంతు అయ్యారు. ఈ సమాచారం అందుకున్న కేయూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. గజ ఈతగాళ్లు గాలింపు చేసి రెండు మృత దేహాలను వెలికి తీశారు. మృతులు బీమారానికి చెందిన దొడ్డిపాటి మన్విత్ (11) దొడ్డిపాటి మహేష్ బాబు (14) గా పోలీసులు గుర్తించారు. మరో బాలుడు విష్ణు తేజ (14) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల అకాల మరణంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.