పాక్‌లో ఇద్దరు భారత అధికారుల అరెస్ట్ ఆపై విడుదల

న్యూఢిల్లీ: భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య సోమవారం రోజుంతా హైడ్రామా సాగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మనదేశ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు భారత అధికారులు ఉదయం కనిపించకుండా పోవడం కలకలం రేగింది. సోమవారం ఉదయం 8 గంటలకు కార్యాలయానికి బయల్దేరిన ఆ అధికారులు ఆఫీస్‌కు చేరకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై భారత సర్కారు వెంటనే రంగంలోకి దిగింది. విదేశాంగశాక, దౌత్య కార్యాలయ అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం, ఆ ఇద్దరు పాకిస్తాన్ […]

Update: 2020-06-15 11:20 GMT

న్యూఢిల్లీ: భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య సోమవారం రోజుంతా హైడ్రామా సాగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మనదేశ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు భారత అధికారులు ఉదయం కనిపించకుండా పోవడం కలకలం రేగింది. సోమవారం ఉదయం 8 గంటలకు కార్యాలయానికి బయల్దేరిన ఆ అధికారులు ఆఫీస్‌కు చేరకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దీనిపై భారత సర్కారు వెంటనే రంగంలోకి దిగింది. విదేశాంగశాక, దౌత్య కార్యాలయ అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరిపారు. అనంతరం, ఆ ఇద్దరు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) అదుపులో ఉన్నట్టు సమాచారం అందింది. ఆ అధికారులు ‘హిట్ అండ్ రన్’ కేసులో అరెస్టయినట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్ట్ చేసింది.

దీంతో భారత హోం శాఖ ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య అధికారికి సమన్లు జారీ చేసింది. ఇరువురి అధికారులను అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించింది. వారిని వేధించకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కాగా, సోమవారం సాయంత్రానికి ఆ ఇద్దరిని పాకిస్తాన్ అధికారులు విడుదల చేసినట్టు సమాచారం అందింది.

Tags:    

Similar News