రెండు వేర్వేరు డోసులతో కొవిడ్ మహమ్మారికి చెక్..!

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారిని జయించేందుకు తీసుకుంటున్న వ్యాక్సిన్‌ను.. ప్రస్తుతం రెండు వేర్వేరు డోసులను కలిపి ఒకే టీకాగా తీసుకోవాలని ఐసీఎంఆర్ ప్రకటించింది. అంటే ఓ వ్యక్తి కోవాక్సిన్ టీకా మొదటి డోస్ తీసుకుంటే రెండో డోస్ కూడా ఆ టీకానే తీసుకోవాలి. కానీ ఒకవేళ రెండు టీకాలను వేసుకుంటే ఏమవుతుందన్న సందేహాలు ప్రజల్లోనూ, ఇటు సైంటిస్టుల్లోనూ వెంటాడుతోంది. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మిశ్రమ టీకాను ఇచ్చారు. వారి నమూలనాలను భారత వైద్య […]

Update: 2021-08-13 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారిని జయించేందుకు తీసుకుంటున్న వ్యాక్సిన్‌ను.. ప్రస్తుతం రెండు వేర్వేరు డోసులను కలిపి ఒకే టీకాగా తీసుకోవాలని ఐసీఎంఆర్ ప్రకటించింది. అంటే ఓ వ్యక్తి కోవాక్సిన్ టీకా మొదటి డోస్ తీసుకుంటే రెండో డోస్ కూడా ఆ టీకానే తీసుకోవాలి. కానీ ఒకవేళ రెండు టీకాలను వేసుకుంటే ఏమవుతుందన్న సందేహాలు ప్రజల్లోనూ, ఇటు సైంటిస్టుల్లోనూ వెంటాడుతోంది. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మిశ్రమ టీకాను ఇచ్చారు. వారి నమూలనాలను భారత వైద్య పరిశోధన మండలి పరిశీలించగా ఆశ్చర్యపరిచే ఫలితాలు వెలువడ్డాయి.

ఒకే టీకా తీసుకున్నవారి కంటే మిశ్రమ టీకా తీసుకున్న వారికి కరోనా నుంచి మరింత రక్షిణ లభిస్తుందని గుర్తించారు. దీనిపై స్పందించిన డీజీసీఐ క్లినికల్ ట్రయల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ పరిశోధనలు బ్రిటన్, స్పెయిన్ దేశాలలో ఇదివరకే మొదలయ్యాయి. దాదాపు 300 మంది ఆరోగ్యవంతమైన వాలెంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ జరపాలని తెలిపింది. వెల్లూర్‌లోని సీఎంసీలో ఈ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న రెండు కొవిడ్ టీకాలను వినియోగించనున్నారు. ఆడినో వైరస్‌ను వాహనంగా ఉపయోగిస్తూ రూపొందించిన కోవీషీల్డ్ టీకా, ఇన్ యాక్టివేటెడ్ హోల్ వైరియాన్ టీకా అయిన కోవాక్సిన్ టీకాలను ఒక్కో డోస్‌కి ఒక టీకా ఇచ్చి పరిశోధించనున్నారు.

Tags:    

Similar News