ఎన్నికల వేళ ఇద్దరు కాంగ్రెస్ నేతలు సస్పెండ్
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికలవేళ ఇద్దరు కాంగ్రెస్ నేతలకు పార్టీ పెద్దలు ఝలక్ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో మలక్ పేట నాయకులపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రేటర్ ఎన్నికల్లో ముసారం బాగ్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మందాడి విజయ సింహారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బద్దం సురేందర్ రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ […]
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికలవేళ ఇద్దరు కాంగ్రెస్ నేతలకు పార్టీ పెద్దలు ఝలక్ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో మలక్ పేట నాయకులపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రేటర్ ఎన్నికల్లో ముసారం బాగ్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మందాడి విజయ సింహారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బద్దం సురేందర్ రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అసలే హస్తం పరిస్థితి అంతంతగా ఉందని భావిస్తున్న నేపథ్యంలో సొంత నేతలే స్వార్ధ ప్రయోజనాలతో ఇలాంటి చర్యలకు పాల్పడటం పార్టీ వర్గాల్లో కలవరం రేకెత్తిస్తోంది.