ప్రశ్నార్థకంగా టోక్యో ఒలింపిక్స్.. మరో ఇద్దరికి పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 13న ఓపెన్ అయిన ఒలింపిక్స్ గ్రామంలో నిన్న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. రోజువారీగా అక్కడ కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా మరో ఇద్దరు అథ్లెట్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈనెల 23న అధికారికంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానుండగా వరుస కరోనా కేసులు నమోదవ్వడం అటు అథ్లెట్లలోనూ ఇటు నిర్వహణ విభాగానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా సోకిన […]

Update: 2021-07-17 23:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 13న ఓపెన్ అయిన ఒలింపిక్స్ గ్రామంలో నిన్న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. రోజువారీగా అక్కడ కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా మరో ఇద్దరు అథ్లెట్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈనెల 23న అధికారికంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానుండగా వరుస కరోనా కేసులు నమోదవ్వడం అటు అథ్లెట్లలోనూ ఇటు నిర్వహణ విభాగానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా సోకిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

Tags:    

Similar News