దేశీ డాగ్‌‌తో నెటిజన్ ఫొటో.. మెచ్చుకున్న మోదీ

దిశ, వెబ్‌డెస్క్ : ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోభాగంగా.. భారత ప్రధాని మోదీ దేశీయ శునకాలను పెంచుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవాళీ జాతులైన.. ముధోల్, హిమాచలీ, రాజపాలయం, కన్ని, చిప్పిపరారి, కొంబాయ్ జాతి కుక్కలను పెంచుకోవాలని సూచించారు. భారతీయ భద్రతా బలగాలు కూడా దేశీయ శునకాల సేవలకే ప్రాధాన్యమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాగా, మోదీ పిలుపు మేరకు ఓ ట్విట్టర్ యూజర్ స్పందించగా.. మోదీ కూడా రిప్లయ్ ఇవ్వడం విశేషం. కర్ణాటకలోని బళ్లారికి చెందిన లాప్రస్కోపిక్ సర్జన్ […]

Update: 2020-09-01 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోభాగంగా.. భారత ప్రధాని మోదీ దేశీయ శునకాలను పెంచుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవాళీ జాతులైన.. ముధోల్, హిమాచలీ, రాజపాలయం, కన్ని, చిప్పిపరారి, కొంబాయ్ జాతి కుక్కలను పెంచుకోవాలని సూచించారు. భారతీయ భద్రతా బలగాలు కూడా దేశీయ శునకాల సేవలకే ప్రాధాన్యమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాగా, మోదీ పిలుపు మేరకు ఓ ట్విట్టర్ యూజర్ స్పందించగా.. మోదీ కూడా రిప్లయ్ ఇవ్వడం విశేషం.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన లాప్రస్కోపిక్ సర్జన్ అరుణ్ ఎస్‌కె.. మోదీ పిలుపునకు స్పందిస్తూ.. ‘ఇది ముధోల్ జాతి జాగిలం, పూర్తిగా భారత్‌కు చెందినది. ఇది రియల్ వాచ్ డాగ్. అంతేకాదు, ఇది ఎంతో ప్రేమను అందించే శునకం’ అని తన పెంపుడు కుక్కను గురించి ట్వీట్ చేస్తూ.. దాని ఫొటోను కూడా జత చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని కూడా ట్యాగ్ చేశారు.

మోదీ పిలుపుపై వెంటనే స్పందించిన అరుణ్‌… ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే.. అరుణ్ ట్వీట్‌కు మోదీ స్పందిస్తూ.. ‘బ్యూటిఫుల్ ఫొటో’ అంటూ రిప్లయ్ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News