'సేఫ్టీ మోడ్'.. ట్విట్టర్ లో అసభ్యకరమైన కామెంట్స్ కి చెక్ పెట్టండి ఇలా..
దిశ, ఫీచర్స్: ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రసంగాలపై మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ కఠినంగా వ్యవహరించలేదని చాలాకాలంగా విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా ‘సేఫ్టీ మోడ్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే మొదటగా అందుబాటులోకి రాగా, ఈ ఫీచర్ ఉపయోగాలేంటీ? ఎలా పనిచేస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం. మైండ్‌లెస్ ట్రోలింగ్, ద్వేషపూరిత, ఇబ్బందికరమైన కామెంట్స్ వల్ల ట్విట్టర్ వినియోగదారులు తరచుగా ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సెలబ్రిటీ, పబ్లిక్ ఖాతాదారులకు ఎక్కువగా ఈ సమస్య ఉంది. ఈ […]
దిశ, ఫీచర్స్: ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రసంగాలపై మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ కఠినంగా వ్యవహరించలేదని చాలాకాలంగా విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా ‘సేఫ్టీ మోడ్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే మొదటగా అందుబాటులోకి రాగా, ఈ ఫీచర్ ఉపయోగాలేంటీ? ఎలా పనిచేస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
మైండ్‌లెస్ ట్రోలింగ్, ద్వేషపూరిత, ఇబ్బందికరమైన కామెంట్స్ వల్ల ట్విట్టర్ వినియోగదారులు తరచుగా ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సెలబ్రిటీ, పబ్లిక్ ఖాతాదారులకు ఎక్కువగా ఈ సమస్య ఉంది. ఈ విషయంలోనే ట్విట్టర్‌పై ఘాటుగానే విమర్శలు రావడంతో ఎట్టకేలకు ‘సేఫ్టీ మోడ్’ గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి, ఒక వినియోగదారుడు తనపై అభ్యంతరకంగా కామెంట్ చేసిన అకౌంట్‌ను కనీసం ఏడు రోజులపాటు బ్లాక్ చేయవచ్చు.
‘ట్విట్టర్‌లో సేఫ్టీ మోడ్ ఫీచర్‌ని ఆన్ చేసినప్పుడు, నెగటివ్ ట్వీట్‌తో.. మీ ఎంగేజ్‌మెంట్‌ను ఈ ఫీచర్ చెక్ చేయడంతో పాటు రెండు ట్వీట్ల కంటెంట్‌ని తనిఖీ చేస్తుంది. ట్వీట్ రాసిన వ్యక్తికి ట్వీట్‌కు బదులిచ్చిన వ్యక్తికి మధ్య సంబంధాన్ని కూడా అంచనా వేస్తుంది. అలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఫౌల్ లాంగ్వేజ్‌ను గుర్తించి వెంటనే ఖాతా ఆటోబ్లాక్ చేస్తుంది. ఒక ఖాతా ఆటోబ్లాక్ అయితే వినియోగదారు మీ ఖాతాను అనుసరించలేరు. మీ ట్వీట్‌లను చూడలేరు లేదా ప్రత్యక్ష సందేశాలు పంపలేరు. ఏడు రోజుల పాటు ఖాతాలు బ్లాక్ చేయబడతాయి.
సేఫ్టీ మోడ్ పీరియడ్ ముగియడానికి ముందు ఈ సమాచారాన్ని రీక్యాప్ చేసే నోటిఫికేషన్ మీకు అందుతుంది. ట్విట్టర్ ఎల్లప్పుడూ సరైన నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇది టెక్నాలజీ ఆధారితమైనది. ఖాతాలు తప్పుగా బ్లాక్ చేసే అవకాశముంది. ఏదేమైనా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా సేఫ్టీ మోడ్ ఆటోబ్లాక్‌లను చూడటంతోపాటు, వాటిని రద్దు కూడా చేయవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో దీన్ని పరీక్షించి, ట్విట్టర్‌లో ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అందులోని లోపాలను గుర్తించి కరెక్ట్ చేయనున్నామని తెలిపింది. పబ్లిక్ సంభాషణలో పాల్గొనడానికి మరింత సౌకర్యవంతమైన, అవసరమైన ఫీచర్స్ తీసుకురావడానికి ట్విట్టర్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొంది.