రిపబ్లిక్ డే‌కి స్పెషల్ ఎమోజీ రిలీజ్ చేసిన ‘ట్విట్టర్’

దిశ, వెబ్‌డెస్క్: మన భావాలను, భావోద్వేగాలను తెలపడానికి సోషల్ మీడియాలో ‘ఎమోజీ’లను ఉపయోగిస్తుంటాం. ఈ చిట్టిపొట్టి ఎమోజీల క్రేజ్ మాములుగా ఉండదు. అందుకే ట్విట్టర్ ప్రతి పండుగ వేళ, ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి ఇతర ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఎమోజీలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సాహసాలను ప్రతిబింబిస్తూ త్రివర్ణ రంగుల్లోని ఎమోజీని రిలీజ్ చేసింది. యావత్ భారతీయులు 72వ రిపబ్లిక్ […]

Update: 2021-01-25 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన భావాలను, భావోద్వేగాలను తెలపడానికి సోషల్ మీడియాలో ‘ఎమోజీ’లను ఉపయోగిస్తుంటాం. ఈ చిట్టిపొట్టి ఎమోజీల క్రేజ్ మాములుగా ఉండదు. అందుకే ట్విట్టర్ ప్రతి పండుగ వేళ, ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి ఇతర ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఎమోజీలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సాహసాలను ప్రతిబింబిస్తూ త్రివర్ణ రంగుల్లోని ఎమోజీని రిలీజ్ చేసింది.

యావత్ భారతీయులు 72వ రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ట్విట్టర్ స్పెషల్ ఎమోజీని సోమవారం విడుదల చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు, దేశ నాయకులు ఈ ఎమోజీని ఉపయోగించునున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అంతేకాదు భారత వైమానిక దళం (@IAF_MCC) #TouchTheSkies అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎమోజీని ఉపయోగించనుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, ఉర్దూ, కన్నడ, పంజాబీ, మరాఠి, మలయాళం, బెంగాళి, గుజరాతి భాషల్లో ఈ ఎమోజీ అందుబాటులో ఉంది. జనవరి 30 వరకు ఈ ఎమోజీని ఉపయోగించుకోవచ్చు. ట్విట్టర్ గతంలో ఇండియా మ్యాప్, త్రివర్ణ రంగులు, ఆశోక చక్రం, ఇండియా గేట్, త్రివర్ణ రంగులతో కూడిన ఇండియా గేట్ వంటి ఐదు ఎమోజీలను విడుదల చేసింది.

Tags:    

Similar News