‘ఆర్ఆర్ఆర్’కు మాస్టర్ స్ట్రోక్?

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది చివరన ఆ పన్నెండు నెలలకు సంబంధించిన ట్రెండింగ్ అంశాలను ట్విట్టర్ విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! ‘2020లో ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన దక్షిణ భారత సూపర్‌స్టార్స్‌ వీరే’ అంటూ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా షేర్‌ చేసింది. దీంతో పాటు ఈ సంవత్సరం ఎక్కువగా ట్వీట్ చేసిన సినిమాల లిస్ట్‌ను కూడా రివీల్ చేసింది. మోస్ట్ ట్వీటెడ్ సౌత్ యాక్టర్స్ -2020 […]

Update: 2020-12-14 06:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది చివరన ఆ పన్నెండు నెలలకు సంబంధించిన ట్రెండింగ్ అంశాలను ట్విట్టర్ విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! ‘2020లో ఎక్కువగా ట్వీట్‌ చేయబడిన దక్షిణ భారత సూపర్‌స్టార్స్‌ వీరే’ అంటూ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా షేర్‌ చేసింది. దీంతో పాటు ఈ సంవత్సరం ఎక్కువగా ట్వీట్ చేసిన సినిమాల లిస్ట్‌ను కూడా రివీల్ చేసింది.

మోస్ట్ ట్వీటెడ్ సౌత్ యాక్టర్స్ -2020 జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండగా.. జనసేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, ధనుష్, మోహన్ లాల్‌, మెగాస్టార్ చిరంజీవి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇక హీరోయిన్ల విష‌యానికొస్తే టాప్ 1లో కీర్తి సురేష్ ఉండగా, నెంబర్ 2 స్థానాన్ని కాజల్ అగర్వాల్ కొట్టేసింది. ఆ తర్వాత సమంత, రష్మిక, పూజ హెగ్డే, తాప్సీ, తమన్న, రకుల్ ప్రీత్, శ్రుతి హాసన్, త్రిషల టాప్ 10లో ఉన్నారు.

సినిమాల పరంగా చూస్తే, విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాస్టర్’ టాప్ వన్ ప్లేస్ దక్కించుకోగా, వకీల్ సాబ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ‘వలిమై, సర్కారు వారి పాట, సురారై పొట్రు, ఆర్ఆర్ఆర్, పుష్ప, సరిలేరు నీకెవ్వరు, కేజీఎఫ్ చాప్టర్ 2, దర్బార్’ చిత్రాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి.

Tags:    

Similar News