‘కూత’లు కూయనున్న ట్విట్టర్ పిట్ట
దిశ, వెబ్‌డెస్క్ : మైక్రోబ్లాగింగ్ దిగ్గజ కంపెనీ ట్విట్టర్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి.. యూజర్ స్టోరీస్ లాంటి ‘ఫ్లీట్స్’ ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా ఆ పిట్ట‘కూత’లు కూసే అవకాశం కూడా ఇస్తోంది. కూతలు కూయడమేంటని అనుకుంటున్నారా? అదేనండీ ‘వాయిస్ ట్వీట్లు’. త్వరలోనే ట్విట్టర్ వాయిస్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్పోటిఫైలతో పాటు.. మరికొన్ని సోషల్ మీడియా సైట్లలో వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉన్నట్లు అందరికీ […]
దిశ, వెబ్‌డెస్క్ :
మైక్రోబ్లాగింగ్ దిగ్గజ కంపెనీ ట్విట్టర్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి.. యూజర్ స్టోరీస్ లాంటి ‘ఫ్లీట్స్’ ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా ఆ పిట్ట‘కూత’లు కూసే అవకాశం కూడా ఇస్తోంది. కూతలు కూయడమేంటని అనుకుంటున్నారా? అదేనండీ ‘వాయిస్ ట్వీట్లు’. త్వరలోనే ట్విట్టర్ వాయిస్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్పోటిఫైలతో పాటు.. మరికొన్ని సోషల్ మీడియా సైట్లలో వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఆ తరహాలోనే ట్విట్టర్ కూడా ‘వాయిస్ ఫీచర్’ను తీసుకు రాబోతున్నట్లు కంపెనీ బుధవారం తెలిపింది. ఈ వాయిస్ ఫీచర్ సాయంతో.. ట్వీట్స్‌తో పాటు దానికి మన వాయిస్ కూడా జతచేసి పోస్ట్ చేయొచ్చు. ఇందుకోసం ట్విట్టర్ హోమ్‌పేజీపై ఓ కొత్త ఐకాన్‌ను యాడ్ చేశారు. మీడియా బటన్ పక్కనే దీన్ని చేర్చారు. ఆ బటన్ క్లిక్ చేసి మన వాయిస్ వినిపిస్తే.. ఆ వేవ్‌లెంగ్త్‌ను గ్రహించి ట్వీట్ చేస్తుంది. ఒక సింగిల్ ట్వీట్‌లో.. సుమారు 140 సెకండ్ల వాయిస్‌ను రికార్డు చేయొచ్చు. అంతకన్నా మించి వాయిస్ ఉంటే.. మరో థ్రెడ్‌లో అది రికార్డు అవుతుంది. ఆడియో క్లిప్ అయిపోగానే.. డన్ అని క్లిక్ చేయగానే పోస్ట్ అవుతుంది.
టెస్టింగ్..
టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్.. ప్రస్తుతానికి యాపిల్‌లోని ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే అందులోనూ కొంతమందికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనుండగా.. రానున్న రోజుల్లో వాయిస్ ఫీచర్‌ను మరికొంత మంది ఐఓఎస్ యూజర్లకు కల్పించనున్నారు. కాగా, ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు డెస్క్‌టాప్ వెర్షన్‌లకు ఈ ఫెసిలిటీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం ట్విట్టర్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
న్యూ ఎక్స్‌పీరియన్స్..
‘టెక్స్ట్‌తో అన్ని విషయాలు కన్వే చేయలేం. కొన్ని విషయాలను వాయిస్‌తో చెబితే వేరే ఇంపాక్ట్ ఉంటుంది. పైగా లిజనర్స్, స్టోరీ టెల్లర్స్‌కు వాయిస్ ట్వీటింగ్ ఓ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. జర్నలిస్ట్‌లు బ్రేకింగ్ న్యూస్‌ను అనౌన్స్ చేయొచ్చు, ప్రియమైన వారికి బర్త్ డే విషెస్ చెప్పొచ్చు. ఇలా వాయిస్‌తో కొన్ని ఈజీగా షేర్ చేయవచ్చు’ అని ట్విట్టర్ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.