మైఖేల్ గాఫ్.. నీవి కళ్లా? కెమెరాలా? 

దిశ, స్పోర్ట్స్ : ఒక టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రశంసించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారేమో. అంపైర్ల (Ampire) నిర్ణయాల్లో కచ్చితత్వం తీసుకొని రావడానికి ఐసీసీ డెషిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ను ప్రవేశపెట్టింది. అయితే అంతే కచ్చితత్వంతో ఒక అంపైర్ నిర్ణయం తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్ గాఫ్. (Michael gaff) ఇంగ్లాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో […]

Update: 2020-08-22 09:59 GMT

దిశ, స్పోర్ట్స్ : ఒక టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రశంసించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారేమో. అంపైర్ల (Ampire) నిర్ణయాల్లో కచ్చితత్వం తీసుకొని రావడానికి ఐసీసీ డెషిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) ను ప్రవేశపెట్టింది. అయితే అంతే కచ్చితత్వంతో ఒక అంపైర్ నిర్ణయం తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

అతనే ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్ గాఫ్. (Michael gaff) ఇంగ్లాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో డామ్ సిబ్లీని మైఖేల్ గాఫ్ ఎల్బీడబ్ల్యూ (LBW)గా ప్రకటించాడు. ప్రత్యక్షంగా చూసిన వాళ్లు అది నాటౌట్ అనే అనుకున్నారు. బ్యాట్స్‌మాన్ డామ్ సిబ్లీ (Dom sibly) కూడా డీఆర్ఎస్ కోరాడు. అయితే రివ్యూలో ఆ బంతి ఏకంగా మిడిల్ స్టంప్‌ను ఎగరేసినట్లు కనిపించింది. అంపైర్ గాఫ్ నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. ఐసీసీ ఏకంగా ఆ వీడియోను షేర్ చేసి ‘అంపైరింగ్‌లో ఇదో గొప్ప భాగం’ అనే క్యాప్షన్ ఇచ్చింది.

టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran aswin) కూడా 100కి 100 మార్కులు అనే క్యాప్షన్‌తో పోస్టు పెట్టాడు. కరోనా నేపథ్యంలో అందరూ స్థానిక అంపైర్లతో ఈసీబీ టెస్టు, వన్డే సీరీస్‌లు నిర్వహిస్తున్నది. వెస్టిండీస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ అంపైర్ల నిర్ణయాలపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో గాఫ్ నిర్ణయం సమాధానంగా నిలిచింది.

https://twitter.com/ICC/status/1296772943616315392

Tags:    

Similar News