ట్విట్టర్ సంచలన ట్విస్ట్

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ కారణంగా.. ఇప్పటికే 90శాతం కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా కంపెనీలు తమ సంస్థలోని ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లను ఉద్యోగులకు ప్యాక్ చేసి ‘వర్క్ ఫ్రమ్’ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాయి. లాక్డౌన్ సడలింపుల కారణంగా మళ్లీ 30శాతం ఉద్యోగులతో ఇప్పుడిప్పుడే ఆయా ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్లోనే పనులు ప్రారంభించాయి. అయితే.. కరోనా వ్యాప్తి మాత్రం […]

Update: 2020-05-13 02:47 GMT

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ కారణంగా.. ఇప్పటికే 90శాతం కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా కంపెనీలు తమ సంస్థలోని ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లను ఉద్యోగులకు ప్యాక్ చేసి ‘వర్క్ ఫ్రమ్’ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాయి. లాక్డౌన్ సడలింపుల కారణంగా మళ్లీ 30శాతం ఉద్యోగులతో ఇప్పుడిప్పుడే ఆయా ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్లోనే పనులు ప్రారంభించాయి. అయితే.. కరోనా వ్యాప్తి మాత్రం తగ్గట్లేదు. దాంతో ఇప్పట్లో కరోనా వైరస్ పోయేటట్లు లేదని ప్రపంచ దేశాలన్నీ ఓ నిర్ణయానికి వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఇక తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

కరోనా వైరస్ తో కలిసి బతికాల్సిందేనని దేశ ప్రధానితో సహా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తేల్చి చెప్పేశారు. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని కారణంగానే.. చాలా కంపెనీలు లాక్డౌన్ తో సంబంధం లేకుండా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డ్యూరేషన్ ను కొన్ని నెలల వరకు పెంచాయి. మరి కొన్ని కంపెనీలు మరో ముందడుగు వేసి 2020 మొత్తం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేసేందుకు అవకాశామిచ్చాయి. ట్విట్టర్ ఈ ట్రెండ్ ను మరో నెక్ట్స్ లెవల్ కు తీసుకుపోయింది. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తాజాగా ఈ విషయాన్ని తమ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ప్రస్తుత కరోనా సంక్షోభం ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని ట్విట్టర్ వెల్లడించింది. ప్రస్థుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు, దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని కోరడంతో దాన్ని అనుమతించామని కంపెనీ తెలిపింది. సెప్టెంబరు నెల వరకు తమ కార్యాలయాలను తెరిచేది లేదని ట్విట్టర్ వివరించింది. మెయింటెన్స్ స్టాఫ్ మాత్రమే ఆఫీసుకు రావాల్సి ఉంటుందని ట్విట్టర్ సీఈవో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సంవత్సరం ఎలాంటి ఈవెంట్స్ ఆఫీసులో జరగవని తెలిపింది. ఏ ప్లాన్లు ఉన్నా.. అవన్నీ 2021 లోనే అని తేల్చేసింది. తమ ఉద్యోగులకు మరో శుభవార్త కూడా అందించింది ట్విట్టర్. అదేంటంటే.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ సప్లయిస్ అలోవెన్స్’ ను 1000 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ‘ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి కంపెనీగా తమ ట్విట్టర్ నిలిచిందని’ ఆయన అన్నారు. అయితే ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు తమ ఉద్యోగులను ఈ ఏడాది చివరి వరకు ‘వర్క్ ఫ్రమ్ చేయడానికి’ అనుమతిచ్చిన విషయం మనందరికీ తెలుసు.

Tags:    

Similar News